ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిషేధిత పురుగుల మందుల సరఫరా దందా యథేచ్ఛగా సాగుతోంది. గుంటూరు జిల్లాలోని ఫ్లాంటా ప్రొడక్ట్స్ కంపెనీ నుంచి కొనుగోలు చేసిన ఈ మందులను సూర్యాపేట జిల్లాలోని పాలకవీడు, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం రైతులకు దళారులు విక్రయిస్తున్నారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన ఓ రైతు తనకున్న 17 ఎకరాల భూమిలో వరి సాగు చేశాడు. పొట్ట దశలోకి వచ్చిన వరిపైరుకు తెగుళ్లు సోకుతున్నాయని గుంటూరు జిల్లా నుంచి పురుగుల మందు కొనుగోలు చేసి వరి పొలంలో పిచికారీ చేశాడు. మందు చల్లిన రెండో రోజుకే 17 ఎకరాల పొలం ఎండి పోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
నిషేధిత పురుగుల మందుల విక్రయం.. అన్నదాతల జీవితాలతో చెలగాటం - banned pesticides sales in suryapet
ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిషేధిత పురుగుల మందుల దందా సాగుతోంది. కొంతమంది దళారులు.. అమాయక రైతులకు పురుగుల మందులు అంటగట్టి వారి పొట్టకొడుతున్నారు. నిషేధిత మందు చల్లడం వల్ల పంట మొత్తం ఎండిపోయి అన్నదాత నష్టాల ఊబిలో చిక్కుకుంటున్నాడు.
పురుగు, దోమ తెగుళ్లకు మంచిగా పని చేస్తుందని తక్కువ ధరకే మందులు దొరుకుతున్నాయని ఖమ్మం. వరంగల్. నల్గొండ. సూర్యాపేట .జిల్లాలలో రైతులు అధిక మొత్తంలో కొనుగోలు చేసి మోసపోతున్నారు. .గుంటూరు పట్టణంలోని మిర్చి యార్డు దగ్గరలో ఉన్న ఫ్లాంటా ప్రొడక్ట్స్ కంపెనీపై గతంలో ఫిర్యాదలు వచ్చినా అధికారులు స్పందించలేదని రైతులు వాపోయారు. ఇప్పటికైనా ఆ కంపెనీని మూసివేయాలని డిమాండ్ చేశారు. ఇంకా ఎంత మంది రైతులు ఈ నిషేధిత మందులు కొనుగోలు చేశారో ఆరా తీసి అందరికీ పరిహారం అందించాలని కోరారు.