సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండరామారంలో పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు ప్లాస్టిక్ నిర్మూలనకు కృషి చేస్తున్నారు. ఒక కిలో ప్లాస్టిక్ తీసుకొచ్చిన వారికి నాలుగు కోడిగుడ్లు ఉచితంగా ఇస్తూ ప్రజల్లో ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నారు.
ప్లాస్టిక్ రహిత గ్రామంగా బండరామారం
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండరామారం గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చడానికి గ్రామస్థులు కంకణం కట్టుకున్నారు. ప్లాస్టిక్ నియంత్రణ కోసం వారో వినూత్న ఆలోచన చేశారు.
ప్లాస్టిక్ రహిత గ్రామంగా బండరామారం
నేటి తరంలో ప్లాస్టిక్ వాడకం విచ్చలవిడిగా పెరిగిందని, దాని ప్రభావం రాబోయే తరాల మీద పడే ప్రమాదముందని తుంగతుర్తి మండలపరిషత్ అధ్యక్షురాలు కవిత అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.
- ఇవీ చూడండి-పక్షికింత ధాన్యం.. గురువుకు అంకింతం..!