సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలోని శివాలయంలో కొండముచ్చు కలకలం సృష్టించింది. సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో కొండముచ్చు ఆలయంలోకి వచ్చి భయభ్రాంతులకు గురి చేసింది. నవగ్రహ మండపంలోకి వెళ్లడం వల్ల భక్తులు భయంతో పరుగులు తీశారు.
శివాలయంలో కొండముచ్చు కలకలం... భక్తులు పరుగులు - హుజూర్‌నగర్‌లో శివాలయంలోకి ప్రవేశించిన కొండముచ్చు
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలోని శివాలయంలోకి కొండముచ్చు దూసుకువచ్చి భక్తులను భయభ్రాంతులకు గురి చేసింది. సోమవారం రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో ఆలయంలోని నవగ్రహ మండపంలోకి చేరి కలకలం సృష్టించింది. చివరకు పశు వైద్యుని సాయంతో మున్సిపల్ సిబ్బంది పట్టుకొని మట్టపల్లి అడవిలో సురక్షితంగా వదిలారు.
శివాలయంలో కొండముచ్చు కలకలం... భక్తులు పరుగులు
పశు వైద్యులు డా.శ్రీనివాస రెడ్డి సాయంతో కొండముచ్చుని మున్సిపల్ సిబ్బంది పట్టుకున్నారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చి... మట్టపల్లి కృష్ణానది తీరంలోని అడవిలో సురక్షితంగా వదిలారు.
ఇదీ చదవండి:కిడ్నాపైన ఏడుగురు భారతీయులు విడుదల