సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలో కొండముచ్చు దాడి చేయడం వల్ల ఝార్ఖండ్‌కు చెందిన వ్యక్తికి నరం తెగి తీవ్ర రక్తస్రావమైంది. గత కొంతకాలంగా కొండముచ్చు దాడి చేయడం వల్ల పలువురికి గాయాలు అయ్యాయి. ఈ విషయంపై సంబంధిత ఫారెస్ట్ అధికారులకు, మండల అధికారులకు పలుసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమేనని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వ్యక్తి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడని, ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
కొండముచ్చు దాడి.. వ్యక్తికి ప్రాణాపాయం - suryapet district news
కొండముచ్చు ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటన సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో బాధితుడికి నరం తెగి తీవ్ర రక్తస్రావమైంది.

కొండముచ్చు దాడి.. వ్యక్తికి ప్రాణాపాయం