తెలంగాణ

telangana

ETV Bharat / state

'పార్టీ మారనని బాండ్ రాసిస్తేనే బీ-ఫామ్' - b-form distribution in kodada to congress

కోదాడ మున్సిపల్ ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థులకు పార్టీ బీ-ఫామ్‌లు మాజీ ఎమ్మెల్యే పద్మావతి అందజేశారు. పార్టీ తరఫున గెలిచినవారు పార్టీ ఫిరాయించకుండా బాండ్‌ పేపర్‌లపై సంతకాలు చేయించుకున్నారు.

'పార్టీ మారనని బాండ్ రాసిస్తేనే బీ-పామ్'
'పార్టీ మారనని బాండ్ రాసిస్తేనే బీ-పామ్'

By

Published : Jan 14, 2020, 6:01 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపల్ ఎన్నికల్లో 35 మందికి మాజీ ఎమ్మెల్యే పద్మావతి కాంగ్రెస్ బీ-ఫామ్‌లు అందజేశారు. పార్టీ తరఫున 112 మంది నామపత్రాలు దాఖలు చేయగా... చివరి వరకు తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. ఆశావహులను ఉపసంహరించుకునేలా ఆమె ఒప్పించి అధికారికంగా అభ్యర్థులను ప్రకటించారు.

కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్‌గా గెలిచినవారు వేరే పార్టీలోకి వెళ్లకుండా అభ్యర్థులతో బాండ్‌ పేపర్‌పై సంతకాలు చేయించుకున్నారు. టికెట్ రాని వారికి భవిష్యత్‌లో పార్టీ అండగా నిలుస్తుందని పద్మావతి హామీ ఇచ్చారు. పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

'పార్టీ మారనని బాండ్ రాసిస్తేనే బీ-ఫామ్'

ఇవీ చూడండి: బస్తీమే సవాల్​: గద్వాల సంస్థానంలో పుర సమరం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details