సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం లక్కవరంలో రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సహజ వనరులతో భూసారాన్ని పెంపొదిస్తూ నాణ్యమైన పంటలు పండించాలనే ఉద్దేశంతో ఈ కార్యమానికి శ్రీకారం చుట్టారు. అవసరం మేరకే రసాయనిక ఎరువులు వాడి, తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడి సాధించేందుకు అనుసరించాల్సిన పద్ధతులను రైతులకు వివరించారు. ఈ గ్రామాన్ని వ్యవసాయ ఆదర్శ గ్రామంగా ఎంపిక చేసి సేంద్రియ వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించనున్నారు.
సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు - suryapeta
సూర్యాపేట జిల్లా లక్కవరంలో భూసార పరీక్షలు నిర్వహించి, సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించారు. వ్యవసాయ ఆదర్శ గ్రామంగా ఎంపిక చేసి రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించే చర్యలు చేపట్టబోతున్నారు.
![సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3666905-thumbnail-3x2-organic-forming.jpg)
రైతులకు అవగాహన సదస్సు