సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో మహిళలు-బాలిక భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. షీ టీమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా డీఎస్పీ నాగేశ్వరరావు హాజరయ్యారు.
'ఆకతాయిల ఆట కట్టించాల్సిందే' - మహిళల భద్రతపై అవగాహన
ఆకతాయిలెవరైనా ఇబ్బందులకు గురి చేస్తే 100, 112 నంబర్లకు డయల్ చేయాలని సూర్యాపేట డీఎస్పీ నాగేశ్వరరావు మహిళలు, విద్యార్థినులకు సూచించారు.
సూర్యాపేటలో మహిళల భద్రతపై అవగాహన
ఆపదలో ఉన్నామని భావించినప్పుడు మహిళలు వెంటనే 100, 112 కు డయల్ చేయాలని డీఎస్పీ సూచించారు. ఆకతాయిలతో ఇబ్బంది పడుతున్నామని విద్యార్థినులు చెప్పగా.. వసతిగృహాలకు సమీపంలో రోజు పెట్రోలింగ్ చేయిస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం దిశ ఘటనలో పోలీసుల పాత్ర హర్షణీయమని, జయహో తెలంగాణ పోలీస్ అంటూ నినాదాలు చేశారు.
- ఇదీ చూడండి : ఆ రెండు రోజులూ ఏం జరిగింది?