సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలోని శ్రీ అరబిందో విజ్ఞాన కేంద్రంలో పోషకాహార మహోత్సవం-2020ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, అంగన్వాడీ టీచర్లు ,కేవీకే శాస్త్రవేత్తలు, తదితరులు పాల్గొన్నారు. మహిళలకు పెరటి తోటల పెంపకంపై అవగాహన కల్పించారు.
మహిళలకు పెరటి తోటల పెంపకంపై అవగాహన కార్యక్రమం - సూర్యాపేట జిల్లా వార్తలు
సూర్యాపేట జిల్లా గడ్డిపల్లిలోని శ్రీ అరబిందో విజ్ఞాన కేంద్రంలో పోషకాహార మహోత్సవం-2020ను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఇంట్లో పెరటి తోటలు నిర్మించాలని మహిళలకు, అంగన్వాడీ కార్యకర్తలకు పెరటి తోటల పెంపకంపై అవగాహన కల్పించారు.

మహిళలకు పెరటి తోటల పెంపకంపై అవగాహన కార్యక్రమం
ప్రతి కుటుంబంలో పోషకాహారం అందించడంలో స్త్రీల పాత్ర ఉంటుందని జిల్లా వ్యవసాయ అధికారి జ్యోతిర్మయి తెలిపారు. ప్రతి మహిళ సరైన పోషకాలను కుటుంబాలకు అందిస్తే పిల్లల భవిష్యత్తుకు పునాది వేసినట్లు అవుతుందన్నారు. ప్రతి ఇంట్లో పెరటి తోటలు నిర్మించాలని మహిళలకు, అంగన్వాడీ కార్యకర్తలకు పెరటి తోటల పెంపకంపై అవగాహన కల్పించారు.
ఇవీ చూడండి: సెప్టెంబర్17 ను పురస్కరించుకుని జెండా ఆవిష్కరించిన నేతల