ఓ ఆరేళ్ల చిన్నారిపై 35ఏళ్ల కీచకుడు అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగింది. ఎవరూ లేని సమయంలో ఇంట్లో ప్రవేశించిన కామాంధుడు ఈ దాష్టీకానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఆలస్యంలో వెలుగులోకి వచ్చింది.
చిన్నారిపై లైంగిక దాడికి యత్నం - Attempted sexual assault on child
తెలుగు రాష్ట్రాల్లో పసి పిల్లలపై కామాంధుల దుశ్చర్యలు సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ 35 ఏళ్ల కామాంధుడు ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. తల్లితండ్రులు ఇంట్లో లేని సమయంలో ఈ దాష్టీకానికి ఒడిగట్టాడు.
చిన్నారిపై లైంగిక దాడికి యత్నం
లైంగిక దాడికి యత్నించిన సమయంలో చిన్నారి అరవటం వల్ల స్థానికులు గుర్తించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితునికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: ఇంతకీ అసలు భోగి అంటే ఏంటీ?