తెలంగాణ

telangana

ETV Bharat / state

అరుణతార రామిరెడ్డి మరణం.. కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు - death

దివంగత అరుణతార  రామిరెడ్డి సంస్మరణ సభ సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లోని ఆయన నివాసంలో జరిగింది. రామిరెడ్డి మరణం విప్లవ సాహిత్యానికి, భారత కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటుగా వక్తలు అభివర్ణించారు.

అరుణతార రామిరెడ్డి మరణం.. కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు

By

Published : May 18, 2019, 5:39 PM IST

దివంగత అరుణతార రామిరెడ్డి భారతీయ కమ్యూనిస్టు పార్టీకి అందించిన సేవలు చిరస్మరణీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి అన్నారు. రామిరెడ్డి ఆకస్మికంగా గుండెపోటుతో చనిపోవడం బాధాకరమన్నారు. హుజూర్​నగర్​లోని రామిరెడ్డి నివాసంలో సంతాప సభ నిర్వహించారు. ఆయన మృతి భారత కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటని ఆయన అభివర్ణించారు. రామిరెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్టీ అభివృద్ధికి పాటుపడ్డారని.. ఆయన ఎంతో మంది నాయకులను సమాజానికి అందించారన్నారు. ఆయన జీవిత చరిత్ర మీద భారతీయ కమ్యూనిస్టు పార్టీ చిన్న పుస్తకమును విడుదల చేస్తుందని సంస్మరణ సభ ద్వారా కమ్యూనిస్టు నాయకులకు తెలియజేశారు.

అరుణతార రామిరెడ్డి మరణం.. కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు

For All Latest Updates

TAGGED:

deathcpi

ABOUT THE AUTHOR

...view details