హుజూర్నగర్లో కేసీఆర్ సభకు ఏర్పాట్లు - arrangements for cm kcr thanks meet in huzurnagar
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో రేపు జరగబోయే కృతజ్ఞత సభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మంత్రి జగదీష్ రెడ్డి, ఉప ఎన్నిక ఇన్ఛార్జి పల్లా రాజేశ్వర్రెడ్డి సభాస్థలిని పరిశీలించారు.
హుజూర్నగర్లో సీఎం కేసీఆర్ సభ
హుజూర్నగర్ ఉపఎన్నికల్లో తెరాస ఘనవిజయం సాధించినందున కృతజ్ఞత సభ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. రేపు జరగబోయే ఈ సభ ఏర్పాట్లను మంత్రి జగదీష్ రెడ్డి, తెరాస ఉప ఎన్నిక ప్రధాన బాధ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి పరిశీలించారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు హుజూర్నగర్లో కృతజ్ఞత సభకు సీఎం కేసీఆర్ హాజరవుతారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. రోడ్డు మార్గం ద్వారా సభాస్థలిని చేరుకుంటారని వెల్లడించారు. సుమారు లక్ష మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలిరానున్నారని వారు తెలిపారు.
- ఇదీ చూడండి : తెరాస గెలిచినంత మాత్రాన పండుగ కాదు: కిషన్రెడ్డి