సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్‌పోస్ట్ వద్ద అన్ని పర్మిషన్లు ఉన్న వాహనాలను రాష్ట్ర పోలీసులు ఆంధ్రప్రదేశ్‌కు పంపిస్తున్నారు. ఆ వాహనాలను ఆంధ్రా చెక్‌పోస్ట్ గరికపాడు వద్ద ఏపీ పోలీసులు అడ్డుకుంటున్నారు. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 150 మంది ప్రయాణికులను తెలంగాణ- ఆంధ్ర సరిహద్దుల్లో ఆపేశారు.
అనుమతులిచ్చినా... తప్పని సరిహద్దు కష్టాలు - CORONA UPDATE
తెలంగాణ పోలీసులు అనుమతులిచ్చినా... ఏపీ చెక్‌పోస్టులు వలస కూలీలకు నో ఎంట్రీ బోర్డులు పెడుతున్నాయి. ఆంధ్రా- తెలంగాణ సరిహద్దులో వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన 150 మంది కూలీలకు సూర్యాపేట జిల్లా రామాపురం చెక్‌పోస్టు వద్ద పోలీసులు అనుమతివ్వగా... ఏపీ చెక్‌పోస్టు వద్ద వారిని ఆపేశారు.
అనుమతులిచ్చినా... తప్పని సరిహద్దు కష్టాలు
అన్ని రకాల అనుమతులు చూపిస్తున్నా... ఆంధ్రా పోలీసులు అడ్డుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. చిన్న పిల్లలతో కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం చేశామని, ఎండ తాపానికి ఇబ్బంది పడుతున్నామని ఆందోళనకు దిగారు. మరోవైపు పోలీసులను వివరణ అడగ్గా... అన్ని రకాల అనుమతులు ఉన్న వారికే ఏపీలోకి అనుమతులు వుంటాయని పోలీసులు చెబుతున్నారు.