కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సొంత గ్రామాలకు ప్రయాణమైన వలస కూలీలకు ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో చుక్కెదురైంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్పోస్ట్ వద్ద తెలంగాణ రాష్ట్ర పోలీసులు అన్ని అనుమతులు చూపిస్తున్న వలస కూలీలను ఏపీకి పంపిస్తున్నా... గరికపాడు చెక్పోస్ట్ వద్ద ఏపీ పోలీసులు వారిని ఆపేస్తున్నారు.
ఇక్కడ్నుంచి పంపినా.. ఏపీలోకి రానీయట్లేదు..! - గరికపాడు చెక్పోస్ట్ వద్ద వలస కూలీలను ఆపేస్తున్న ఏపీ పోలీసులు
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఏపీకి బయలుదేరిన వారిని తెలంగాణ పోలీసులు ఇళ్లకు పంపిస్తున్నారు. కానీ గరికపాడు చెక్పోస్ట్ వద్ద ఏపీ పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. సరైన అనుమతులున్నాయని చెప్పినా వినకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వలస కూలీలు వాపోతున్నారు.

ఈ రోజు సుమారు 300 మంది కూలీలు వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్ర ప్రాంతానికి ప్రయాణమయ్యారు. సంబంధిత తహసీల్దార్, అధికారుల అనుమతి తీసుకొని కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం చేసి వస్తే... తీరా ఇక్కడికి వచ్చాక ఏపీలోకి ప్రవేశం నిరాకరిస్తున్నారని కూలీలు వాపోతున్నారు. అయినా సరే కూలీలు అక్కడే గంటలకొద్దీ పడిగాపులు కాస్తు చిన్న పిల్లలతో నానా ఇబ్బందులు పడుతున్నారు. కూలీల ఇబ్బందులు గమనించిన తెలంగాణ పోలీసులు వలస కూలీలకు భోజనం, మంచి నీరు, మజ్జిగ అందించారు.
ఇవీ చూడండి:క్షేత్రస్థాయిలో నిఘా: ఆ సడలింపులు ఇద్దామా? వద్దా?