తెలంగాణ

telangana

దొండపాడులో అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం

By

Published : Dec 20, 2020, 12:54 PM IST

సూర్యాపేట జిల్లా దొండపాడు గ్రామంలో అంబేడ్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మార్పీఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ambedkar-statue-destroyed-at-dondapadu-in-suryapet-district
దొండపాడులో అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా బాధాకరం అని ఎమ్మార్పీఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ధ్వంసం చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కుల, మత భేదాలు లేకుండా రాజ్యాంగం నిర్మించిన వ్యక్తికి ఇలా జరగటం చాలా బాధాకరమని... 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు.

దొండపాడులో అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం

దోషులను శిక్షించే వరకు ధర్నా విరమించేది లేదని తేల్చి చెప్పారు. ఈ ఘటనపై ఏ ఒక్క రాజకీయ నాయకుడు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:నాటుకోడి.. నాటుకోడే.. తింటే వదిలిపెట్టరంతే!

ABOUT THE AUTHOR

...view details