హుజూర్‌నగర్ ఉపఎన్నిక పోరులో అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ... తెరాసపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని దర్పం చెలాయిస్తున్నారంటూ కేటీఆర్‌పై... టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ మండిపడ్డారు. సతీమణి గెలుపు కాంక్షిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి... హుజూర్‌నగర్ పబ్లిక్ క్లబ్ మైదానంలో బహిరంగ సభ నిర్వహించారు. పార్టీ ముఖ్య నేతలు భట్టి, పొన్నం, శ్రీధర్ బాబు, ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్ తోపాటు... ఉమ్మడి నల్గొండకు చెందిన జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రెడ్డి హాజరయ్యారు.
ప్రజలకు, నియంతకు మధ్య పోరు..
తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పట్నుంచి హుజూర్‌నగర్ నియోజకవర్గంలో... రూ. 2 వేల కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేశానని ఉత్తమ్ వివరించారు. ఒక శాసనసభ్యుడు ఆ స్థాయిలో నిధులు ఖర్చు చేయడం దేశంలో ఎక్కడా లేదని చెప్పుకొచ్చారు. కేసీఆర్ తీరుపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు, నియంతకు మధ్య జరుగుతున్న పోరుగా... హుజూర్‌నగర్ ఉపఎన్నికను అభివర్ణించారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను... ఆరేళ్ల పాలన కాలంలో అప్పుల రాష్ట్రంగా మార్చారని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు.
నాలుగు కుటుంబాలే బాగుపడ్డాయి..