తెలంగాణ

telangana

ETV Bharat / state

గుర్రంబోడు గిరిజనులకు న్యాయం చేయాలి... గవర్నర్​కు వినతి - telangana varthalu

గుర్రంబోడు గిరిజనులకు న్యాయం చేయాలని గవర్నర్​ను అఖిలపక్ష నేతలు కోరారు. గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని గవర్నర్​ తమిళిసై దృష్టికి తీసుకెళ్లినట్లు తెతెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్​.రమణ తెలిపారు.

గుర్రంబోడు గిరిజనులకు న్యాయం చేయాలి... గవర్నర్​కు వినతి
గుర్రంబోడు గిరిజనులకు న్యాయం చేయాలి... గవర్నర్​కు వినతి

By

Published : Feb 13, 2021, 9:40 PM IST

సూర్యాపేట జిల్లా గుర్రంబోడు గిరిజనులకు న్యాయం చేయాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను అఖిలపక్ష నేతలు కోరారు. భూ కబ్జాదారుల నుంచి గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ తెలిపారు.

తాము లేవనెత్తిన విషయాలపట్ల గవర్నర్ సానుకూలంగా స్పందించారని గిరిజనులకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారని విపక్ష నేతలు తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో తెలుగుదేశంతో పాటు కాంగ్రెస్‌, సీపీఐ, తెలంగాణ జనసమితి, న్యూడెమొక్రసీ నేతలు ఉన్నారు.

గుర్రంబోడు గిరిజనులకు న్యాయం చేయాలి... గవర్నర్​కు వినతి

ఇదీ చదవండి: అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్​ లక్ష్యం: కొప్పుల

ABOUT THE AUTHOR

...view details