తెలంగాణ

telangana

ETV Bharat / state

'యూరియా కొరత లేదు... అవసరమైనంతే వాడండి' - 'యూరియా కొరత లేదు... అవసరమైనంతే వాడండి'

సూర్యాపేట జిల్లాలో యూరియా కొరత లేదని... అవసరమైనంత స్టాక్​ ఉందని వ్యవసాయ శాఖ తెలిపింది. త్వరలోనే యూరియాను రైతులకు పంపిణీ చేయనున్నట్టు జిల్లా వ్యవసాయ శాఖాధికారి జ్యోతిర్మయి తెలిపారు. అన్నదాతలు తగిన మోతాదులోనే ఎరువును పంటకు ఉపయోగించాలని సూచించారు.

agriculture officer meet in suryapet
'యూరియా కొరత లేదు... అవసరమైనంతే వాడండి'

By

Published : Feb 1, 2020, 10:55 AM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ పట్టణంలో యూరియా కొరతపై జిల్లా వ్యవసాయ శాఖాధికారి జ్యోతిర్మయి సమీక్ష జరిపారు. జిల్లాలో యూరియా కొరత లేదన్నారు. జిల్లాకు 30 వేల మెట్రిక్ టన్నుల అవసరం ఉండగా.. ప్రస్తుతం 29 వేల మెట్రిక్ టన్నుల స్టాక్ ఉందని తెలిపారు.

హుజూర్​నగర్ మండలానికి 4,700 మెట్రిక్ టన్నుల యూరియా పడుతుంది. ఇప్పటి వరకు 2,685 మెట్రిక్ టన్నుల ఎరువును రైతులు కొనుగోలు చేశారని.. ఇంకా 2,000 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అవసరమని అన్నారు.

యూరియా అధికంగా వాడటం వల్ల తెగుళ్లు ఎక్కువగా వచ్చి పంట దిగుబడి తగ్గుతుందని జ్యోతిర్మయి హెచ్చరించారు. తెగుళ్లు వచ్చినప్పుడు రసాయన మందులు వాడటం వల్ల భూ సారం తగ్గి పంట దెబ్బతింటుందన్నారు. అవసరమున్నంత వరకు మాత్రమే యూరియాను వాడాలని సూచించారు. రైతులు యూరియా కొనుగోలు చేసేటప్పుడు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని తెలిపారు.

'యూరియా కొరత లేదు... అవసరమైనంతే వాడండి'

ఇదీ చూడండి: ఆర్థిక సర్వేలో పెట్టుబడి సాయం ప్రస్తావన

ABOUT THE AUTHOR

...view details