సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఓ కారు... శ్రీరంగాపురం స్టేజి వద్దకు రాగానే ఒక్కసారిగా టైరు పగిలి ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా ద్వంసం కాగా... ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు వ్యక్తులు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు తెలిపారు.
టైరు పగిలి ఆటోను ఢీకొట్టిన కారు - ACCIDENT NEWS IN SURYAPET
అప్పటి వరకు బాగానే ప్రయాణించిన కారు... ఒక్కసారిగా టైరు పేలి ప్రమాదానికి కారణమైంది. ఈ ప్రమాదంలో కారు ముందు వెళ్తున్న ఆటోలోని ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
![టైరు పగిలి ఆటోను ఢీకొట్టిన కారు ACCIDENT AT KODHADA BYPASS ROAD](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5383113-thumbnail-3x2-ppp.jpg)
ACCIDENT AT KODHADA BYPASS ROAD