సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ మండలంలో ఆశా కార్యకర్తపై కరోనా సోకిన వ్యక్తి కుటుంబం దాడి చేసిన ఘటనను నిరసిస్తూ తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది నిరసనకు దిగారు. నూతన్‌కల్, నాగారం, తిర్మలగిరి మండలాల్లో ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది ఆందోళన చేపట్టి.. దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఆశా కార్యకర్తపై దాడికి నిరసన.. వైద్య సిబ్బంది సంఘీభావం!
సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ మండలంలో కరోనా సోకిన వ్యక్తి కుటుంబం ఆశా కార్యకర్తపై దాడికి పాల్పడినందుకు నిరసనగా తుంగతుర్తి నియోజకవర్గంలోని నూతన్‌కల్, నాగారం, తిర్మలగిరి మండలాల్లో ఆశా కార్యకర్తలు నిరసనకు దిగారు. ఆశాల నిరసనకు వైద్య సిబ్బంది సైతం మద్ధతు పలికారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
గత ఆరు నెలలుగా రాత్రింబవళ్లు కరోనా బాధితుల కోసం పని చేస్తున్న ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బందిపై దాడులకు దిగడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు చర్యలు తీసుకోవాలని.. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి.. బుద్ధి చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా సర్వేయర్ అధికారి గోపి, నూతనకల్ మండల వైధ్యాధికారి త్రివేణి, మురళీకృష్ణ, నాగారం మండల వైద్యాధికారి డాక్టర్ పవన్ కుమార్, ధనమ్మ, ఎల్లమ్మ, నాగమ్మ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:కొత్త విద్యా విధానం... కొన్ని సవాళ్లు!