తెలంగాణ

telangana

ETV Bharat / state

ఔషధ దుకాణంలో.. వివాహిత బలవన్మరణం - woman committed suicide in Kodada town of Suryapeta

బతుకు భారమై బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు మానవ జీవితంలో నిత్యకృత్యమవుతున్నాయి. కారణాలేమైనప్పటికీ.. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు కుటుంబ సభ్యులను విషాదంలోకి నెట్టేస్తున్నాయి. . ఇలాంటి ఘటనే సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో చోటుచేసుకుంది.

A woman committed suicide in Kodada town of Suryapeta district due to financial difficulties
ఔషధ దుకాణంలో.. వివాహిత బలవన్మరణం

By

Published : Jan 14, 2021, 9:48 PM IST

తాత్కాలిక సమస్యలకు.. శాశ్వత పరిష్కారాన్ని ఎంచుకున్న ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణములో చోటుచేసుకుంది.

ఆర్థిక ఇబ్బందులు

కోదాడ పట్టణానికి చెందిన శ్రీలత, రాజు భార్యభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త రాజు హుజూర్​నగర్​ రోడ్డులో ఓ ఔషధ దుకాణం నిర్వహించేవాడు. రెండేళ్ల నుంచి రాజు అనారోగ్యం బారిన పడటంతో.. దుకాణ బాధ్యతలు ఆమె చూసుకునేది. భర్త అనారోగ్యానికి తోడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తలెత్తటంతో .. ఆమె కొంత కాలంగా మానసికంగా ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు.

ఎవరు లేని సమయంలో ..

రోజులాగే శ్రీలత మెడికల్​ షాప్​ను తెరిచింది. ఎవరు లేని సమయంలో దుకాణంలోని ఫ్యాన్​కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికే శ్రీలత మృతి చెంది ఉండటం చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

'మానవ జీవితంలో పుట్టుకతో పాటు మరణాలు నిత్యకృత్యమయ్యాయి. కానీ .. ఈ నాగరిక ప్రపంచంలో బలవన్మరణాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కారణాలేమైనప్పటికీ చావనేది కర్మ కావాలి కాని క్రియ కాకూడదు'.

ఇదీ చదవండి:బావిలో దూకి పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details