దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని గొల్ల కురుమ నవ నిర్మాణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసరి నరేశ్ అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లిలో దొడ్డి కొమురయ్య విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు.
'జనగామ జిల్లాకు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలి' - సూర్యాపేట జిల్లా తాజా వార్త
జనగామ జిల్లాకు తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలు వదిలిన దొడ్డి కొమురయ్య పేరును పెట్టాలని గొల్ల కురుమ నవ నిర్మాణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసరి నరేశ్ డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా రావులపల్లిలో కొమురయ్య విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యారు.
'జనగామ జిల్లాకు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలి'
తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలు వదిలిన మొట్టమొదటి వ్యక్తి దొడ్డి కొమరయ్య అని అన్నారు. ఆయన సొంత జిల్లా అయిన జనగామ జిల్లాకు కొమరయ్య పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొమురయ్య వర్ధంతి, జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు.