తెలంగాణ

telangana

ETV Bharat / state

సూర్యాపేటలో షర్మిలకు ఘనస్వాగతం - ఖమ్మంలో సంకల్పసభకు వెళ్తున్నషర్మిల

ఖమ్మంలో సంకల్ప సభకు వెళ్తున్న వైఎస్ షర్మిలకు సూర్యాపేట జిల్లాలో ఘనస్వాగతం లభించింది. స్థానిక కొత్త బస్టాండు సమీపంలో వాహనం దిగి అభిమానులకు ఆమె అభివాదం చేశారు.

samkalpa Sabha
Sharmila, ys Sharmila

By

Published : Apr 9, 2021, 3:49 PM IST

సంకల్ప సభకు వెళ్తున్న వైఎస్​ షర్మిలకు సూర్యాపేటలో ఘనస్వాగతం లభించింది. హైదరాబాద్​ నుంచి భారీ కాన్వాయ్​తో ఖమ్మం బయలుదేరిన షర్మిల... సూర్యాపేటలో కాసేపు విశ్రాంతికోసం ఆగారు.

షర్మిలను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. స్థానిక కొత్త బస్టాండు సమీపంలో వాహనం నిలిపి అభిమానులకు అభివాదం చేశారు. అనంతరం చివ్వెంల మండల కేంద్రంలో విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రానికి ఖమ్మం చేరుకోనున్నారు.

ఇదీ చూడండి:ఖమ్మం సంకల్ప సభకు బయలుదేరిన వైఎస్ షర్మిల

ABOUT THE AUTHOR

...view details