సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో అనారోగ్యంతో బాధ పడుతున్న ఓ వృద్ధురాలికి దగ్గుపాటి సుశీల రాజారత్నం ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తమందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న మఠంపల్లికి చెందిన చెల్లినమ్మ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఆమెకు రక్తం అవసరం రావడం వల్ల వైద్యుడు దగ్గుపాటి ట్రస్ట్‌ని సంప్రదించారు. వారు స్పందించి వెంటనే బీ పాజిటివ్ బ్లడ్ ఇప్పించారు. తుమ్మలపల్లి పరమేశ్.. తన పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేశాడు.
పుట్టిన రోజు సందర్భంగా వృద్ధురాలికి రక్తదానం - హుజూర్నగర్ తాజా వార్తలు
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధురాలికి ఓ యువకుడు రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా రక్తమిచ్చినట్లు అతను తెలిపాడు.
పుట్టిన రోజు సందర్భంగా వృద్ధురాలికి రక్తదానం