సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో సైదులు అనే వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. సైదులు మరణానికి లైన్ మెన్ నిర్లక్ష్యమే కారణమంటూ.. మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. విద్యుత్ ఉపకేంద్రం ముందు మృతదేహంతో బైఠాయించారు. సైదులు కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
విద్యుదాఘాతంతో యువకుడు మృతి - protest with deadbody in suryapeta district
విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో జరిగింది. లైన్మెన్ నిర్లక్ష్యమే యువకుడి మరణానికి కారణమంటూ మృతుడి తరఫు బంధువులు ఆందోళనకు దిగారు.
విద్యుదాఘాతంతో యువకుడు మృతి