తెలంగాణ

telangana

ETV Bharat / state

గుర్రంబోడు తండా ఘటనలో 21 మందిపై కేసు నమోదు - Telangana news

గుర్రంబోడు తండా ఘటనలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​తోపాటు 21 మందిపై కేసు నమోదైంది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడు తండాలో ఆదివారం జరిగిన గిరిజన భరోసా యాత్ర ఘటనలో తీవ్రంగా గాయపడిన కోదాడ ఎస్సై క్రాంతికుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

గుర్రంబోడు తండా ఘటనలో 21 మందిపై కేసు నమోదు
గుర్రంబోడు తండా ఘటనలో 21 మందిపై కేసు నమోదు

By

Published : Feb 8, 2021, 11:04 PM IST

గుర్రంబోడు తండా ఘటనలో 21 మందిపై కేసు నమోదైంది. వీరిలో ఆరుగురు భాజపా నాయకులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడు తండాలో ఆదివారం జరిగిన గిరిజన భరోసా యాత్ర ఘటనలో తీవ్రంగా గాయపడిన కోదాడ ఎస్సై క్రాంతికుమార్ ఫిర్యాదుతో నమోదైంది.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, సూర్యాపేట జిల్లా భాజపా అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డితో సహా 18 మందిపై మఠంపల్లి పోలీస్ స్టేషన్​లో కేసులు నమోదయ్యాయి. వీరిలో ఆరుగురిని అరెస్ట్ చేసి కోదాడ మేజిస్ట్రేట్ శ్రీదేవి ముందు హాజరుపరిచారు. జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డితో సహా భాజపా రాష్ట్ర నాయకుడు వేలంగి రాజు మరో నలుగురికి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించి నల్గొండ జైలుకు తరలించారు.

ఇదీ చూడండి:కబ్జాదారులకు కేసీఆర్ కొమ్ముకాస్తున్నారు : బండి సంజయ్

ABOUT THE AUTHOR

...view details