తెలంగాణ

telangana

ETV Bharat / state

అరుదైన వ్యాధి కబళిస్తోంది... ఆ అమ్మ హృదయం అర్థిస్తోంది! - mohan baba waiting for donners help

పిల్లలకు చిన్న జ్వరమొస్తేనే విలవిల్లాడిపోతాం.. అలాంటిది కళ్లెదుటే తమ బిడ్డ నరకయాతన పడుతుంటే కన్నపేగు తల్లడిల్లిపోతుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడి ఆరోగ్యం... రోజురోజుకు క్షీణించిపోతుంటే ఆ తల్లిదండ్రుల ఆవేదన వర్ణణాతీతం. బిడ్డను కాపాడుకునేందుకు ఉన్నదంతా ఖర్చు చేశారు. చేతిలో చిల్లి గవ్వలేక... అరుదైన వ్యాధితో బతుకు పోరాటం చేస్తున్న బిడ్డను కాపాడుకోవడానికి దాతల సాయంకోసం ఎదురు చూస్తున్నారు.

A boy with a rare disease
అరుదైన వ్యాధితో బిడ్డ నరకయాతన

By

Published : Feb 2, 2020, 7:57 PM IST

Updated : Feb 2, 2020, 9:13 PM IST

అరుదైన వ్యాధి.. ఓబిడ్డ నరకయాతన

ఆడుతూ పాడుతూ ఉండాల్సిన తనయుడు అరుదైన వ్యాధితో... నరకయాతన పడుతుంటే... ఏంచేయాలో పాలుపోక రోధిస్తున్నారు తల్లిదండ్రులు. సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్‌కు చెందిన మహమ్మద్ రఫీ, బేగంల కుమారుడు మహమ్మద్ మోహిన్ బాబా... ఎనిమిదో తరగతిలో అరుదైన వ్యాధితో మంచానికి పరిమితమయ్యాడు.

ఉన్నదంతా ఊడ్చి

ఆర్​ఎంపీగా పనిచేస్తున్న రఫీ... కుమారుడిని బాగు చేసుకోడానికి ఆస్తులన్నీ అమ్మి వైద్యం చేయించాడు. హైదరాబాద్​లోని యశోద ఆస్పత్రి వైద్యులు... బాబాకు అరుదుగా వచ్చే వైరల్​ ఇన్​ సపోలిటీఎస్​ అనే మెదడు నరానికి సంబంధించిన వ్యాధి వచ్చినట్లు తేల్చారు. కొడుకును దక్కించుకోవడానికి సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చు చేశాడు. అక్కడ తగ్గక పోయేసరికి కేరళలోని ఆయుర్వేద ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం తమ కుమారుడి ఆరోగ్యం మెరుగవుతుందన్న ఆశ కలిగిందని బాబా తండ్రి తెలిపారు. ఆర్థిక స్థోమత లేక వైద్యానికి ఇబ్బందవుతోందని... దాతలు స్పందించి... తన కుమారుడిని బతికించమంటూ ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

దాతలు స్పందించండి

వారి కష్టాలను చూసిన స్థానికులు తమ వంతు సాయం చేస్తున్నారు. ప్రభుత్వం, దాతలు స్పందించి బాలుడి వైద్యానికి ముందుకు రావాలని కోరుతున్నారు. వేడుకలకు, సంబురాలకు ఎంతో ఖర్చు చేస్తాం... పెద్ద మనసుతో ఈ బాలుడికి చేసే సాయం ఓ ప్రాణాన్ని నిలబెట్టడమే కాదు... ఓ కుటుంబానికి ఊపిరి పోస్తుంది.

ఇదీ చూడండి: వనదేవతల జాతరలో కోయదొరల జోరు

Last Updated : Feb 2, 2020, 9:13 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details