గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం బెల్లంకొండ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో పులిచింతల జలాశయం సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు శ్రీనగేశ్ తెలిపారు. భూమి లోపలి పొరల్లోని పలకల మధ్య ఒత్తడి పెరిగడం వల్లే స్వల్పంగా భూమి కంపిస్తుందని గుర్తించారు. మైనింగ్ తవ్వకాల వల్ల కానీ, జలాశయంలో పూర్తి స్థాయిలో నీటినిల్వ చేయడం ద్వారా ప్రకంపనాలు రావడం లేదని వెల్లడించారు. గత డిసెంబర్ 1 నుంచి ఇప్పటివరకు 16 గ్రామాల్లో 32 సార్లు భూమి స్వల్పంగా కంపించినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వీటి తీవ్రత భూకంప లేఖినిపై 1 నుంచి 3.2గా నమోదైనట్లు తెలిపారు.
పులిచింతల పరివాహకంలోనే భూకంపం ఎందుకొస్తోందో తెలుసా! - 32 earth quake in one month at suryapaet district
నెల రోజులుగా 16 గ్రామాలను భూకంపం భయపెట్టిస్తోంది. పులిచింతల జలాశయం సమీపంలో ఉన్న గ్రామాల్లో డిసెంబర్ 1 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు 32 సార్లు భూమి కంపించడం అక్కడి వాసులను కలవరం పెట్టిస్తోంది. దీనిపై అధ్యయనం చేసిన ఎన్జీఆర్ఐ బృందం పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అసలు ఈ ప్రకంపనలకు కారణం ఏమిటి?
ఈ భూప్రకంపనలు సాధారణమేనని... ఎలాంటి ఆందోళన అవసరం లేదని నగేశ్ తెలిపారు. తీవ్రత తక్కువగా ఉండటం వల్ల ప్రజలు ఎలాంటి ఆందోళనలకు, అపోహలకు గురికావద్దని వెల్లడించారు. చింతలపాలెం మండలం దొండపాడు, గుంటూరు జిల్లా బెల్లంకొండ గ్రామాల్లో తాత్కాలిక సెస్మోగ్రాఫ్ వ్యవస్థల్ని ఏర్పాటు చేయాలని శ్రాస్తవేత్తలు నిర్ణయించారు. దీని ద్వారా జోన్పరిధిలో 1 నుంచి 3.5లోపు తీవ్రత ఉంటే గుర్తించవచ్చని తెలిపారు. 5 తీవ్రత కలిగినవి ప్రపంచంలో ఎక్కడ సంభవించినా సెస్మోగ్రాఫ్ ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించారు.
ఇవీ చూడండి: ప్రజలకు అందుబాటులోకి రానున్న మరో మెట్రో కారిడార్