సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన నలుగురు చిన్నారులు దాతృత్వం చాటుకున్నారు. రిషికేశ్, రిశీత, అక్షయ్, అశాయ్ తాము దాచుకున్న సొమ్ము రూ. 30 వేలను సీఎం సహాయనిధికి అందించారు.
30 వేల సాయం.. చిన్నారులను అభినందించిన కేటీఆర్ - సూర్యాపేట జిల్లా ఈరోజు వార్తలు
తల్లిదండ్రులు అప్పుడప్పుడూ ఇచ్చిన డబ్బులు చిన్నారులు దాచుకున్నారు.. లాక్డౌన్ సమయంలో రాష్ట్రంలో పరిస్థితులను చూసిన పిల్లలు చలించిపోయారు.. తామూ కూడా సాయం చేయాలనుకున్నారు. స్థానిక ఎమ్మెల్యేను కలిసి సీఎం సహాయనిధికి రూ. 30 వేలను సాయంగా అందించారు. సమాచారం తెలిసిన మంత్రి కేటీఆర్ వారిని అభినందించారు.
30 వేల సాయం.. చిన్నారులను అభినందించిన కేటీఆర్
కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్కు రూ. 30 వేల రూపాయల చెక్కును ఇచ్చారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా కేటీఆర్కు తెలియజేశారు. స్పందించిన కేటీఆర్ చిన్నారుల సహాయాన్ని అభినందించారు.
ఇదీ చూడండి :'లాక్డౌన్ కఠినంగా అమలు..అనవసరంగా బయటకు రావొద్దు'