తెలంగాణ

telangana

ETV Bharat / state

చికెన్‌ షాపులో పనిచేస్తున్న యువకుడికి పాజిటివ్‌ - తిరుమలగిరిలో కరోనా పాజిటివ్‌ కేసు

సూర్యాపేట జిల్లా తిరిమలగిరిలో కరోనా సోకిన వారి సంఖ్య మూడుకు చేరింది. మున్సిపాలిటీ కేంద్రంలోని చికెన్ షాప్‌లో పనిచేస్తున్న యువకుడికి వైరస్‌ సోకినట్లు వైద్యులు నిర్థరించారు. ఈ వ్యక్తితో సంబంధమున్న 26 మందిని జిల్లా క్వారంటైన్‌కు తరలించారు. ఈ షాపు నుంచి చికెన్‌ తీసుకెళ్లిన వారంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

3 positive cases
తిరిమలగిరి

By

Published : Apr 17, 2020, 12:53 PM IST

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పట్టణ కేంద్రంలోని చికెన్ షాప్‌లో పనిచేస్తున్న యువకుడికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు నిర్ధరించారు. మర్కజ్ నుంచి వచ్చిన సూర్యాపేటకు చెందిన వ్యక్తి ద్వారా మొదటగా తిరుమలగిరికి చెందిన వ్యక్తికి వైరస్ సోకింది. అతనితో సంబంధం ఉన్న 63 మందిని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్వారంటైన్‌కు తరలించారు. వీరికి పరీక్షలు నిర్వహించగా ఓ యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ షాపు నుంచి చికెన్‌ తీసుకెళ్లిన వారంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

తాజా కేసుతో కలిపి తిరుమలగిరి పట్టణంలో కరోనా బాధితుల సంఖ్య మూడుకు చేరుకుంది. ఈ వ్యక్తితో సంబంధమున్న 26 మందిని జిల్లా క్వారంటైన్‌కు తరలించారు. తిరుమలగిరి పట్టణం పాత గ్రామంలో మూడో కేసు నమోదు కావడంతో పాత గ్రామం మొత్తాన్ని కంటైన్మెంట్‌గా ప్రకటించారు. గ్రామంలోకి ఎవరిని అనుమతించడం లేదు.

ఇదీ చదవండి:మృతులు 14.. అందులో 13 మంది మగవారే

ABOUT THE AUTHOR

...view details