Three Family Persons Died in Suryapet : రాష్ట్రంలో వర్షాలు వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది వారి ఇళ్లను కోల్పోయారు. మరికొందరి ఇళ్లు తడిసి ముద్ధైయ్యాయి. ఇలాంటి ఇంట్లో నివసించడం వల్ల ప్రమాదం జరిగింది. ఏకంగా ప్రాణాలు పోయాయి. తడిసిన ఇంటి గోడ కూలి ఒకే కుటుంబానికి చెందని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వారి చుట్టు పక్కల ఎవరు నివసించనందున వారి చనిపోయినట్లు స్థానికులు ఆలస్యంగా గుర్తించారు. విద్యుత్ శాఖ సిబ్బంది ఆ ఇంటి వైపు వెళ్తుండగా గుర్తించి.. పోలీసులకి తెలిపారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది.
Wall Collapse 3 died in Suryapet : ఇంటి గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి - Three Family Persons Died at nagaram
17:58 August 03
breaking
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. : సూర్యాపేట జిల్లాలోని నాగారం మండల కేంద్రానికి చెందిన శీలం రాములు (90) శీలం రాములమ్మ(70) శీలం శ్రీను (35) ) బుధవారం వారి ఇంట్లో నివసిస్తున్న సమయంలో ఇంటి మధ్య గోడ పూర్తిగా కూలి.. వారి మీద పడింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఇరుగు పొరుగు వారు ఎవరు లేనందున ఈ విషయం స్థానికులకు తెలియలేదు. గురువారం సాయంత్రం వారి ఇంటికి కరెంట్ వసూలు కోసం సిబ్బంది వెళ్లగా.. వారి ఇళ్లు కూలిపోయి కనిపించింది. దీంతో అందులో వారిని గుర్తించి మృతి చెందినట్లు నిర్ధారించుకున్నారు. వెంటనే స్థానికులు ఆ ప్రదేశానికి చేరుకుని జరిగిన విషాదానికి విలపించారు. అనంతరం పోలీసులకి తెలిపారు.
MRO Respond on Three People Died at Nagaram: సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని.. పరిశీలించారు. స్థానికుల సాయంతో మృతదేహాలని వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై సీఐ శివశంకర్, ఎస్ఐ ముత్తయ్యలు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయంపై స్థానిక ఎంఆర్‌ఓ బ్రహ్మయ్య స్పందించి.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి మట్టి గోడలు తడిసి.. ఇల్లు కూలి ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతుడు శ్రీనుకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె, భార్య ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన తల్లి, తండ్రి, కుమారుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చదవండి :