సూర్యాపేట జిల్లా అనంతగిరి పోలీసులు భారీ మొత్తంలో గుట్కా నిల్వలు పట్టుకున్నారు. వారం కిందట పట్టుబడిన గుట్కా కేసులో నిందితురాలిచ్చిన సమాచారంతో... ఆమెకు అక్రమంగా గుట్కా సరఫరా చేస్తున్న ముదిగొండ, ఖమ్మం ప్రాంతాలకు చెందిన వ్యాపారుల దుకాణాలలో సోదాలు నిర్వహించారు. వారి నుంచి సుమారు 15 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు కోదాడ డీఎస్పీ రఘు వెల్లడించారు. మొత్తం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, ఓ వ్యక్తి పరారీలో ఉన్నాడని తెలిపారు. నిందితుల నుంచి గుట్కా, ఆటో, రెండు చరవాణిలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్టేషన్ ప్రాంతం గుట్కా ప్యాకెట్లతో నిండిపోవడం వల్ల స్థానికులు ఆసక్తిగా చూశారు.
15 లక్షలు విలువైన గుట్కా స్వాధీనం - Anantagiri Police seized Rs 15 lakh worth of Gutka
అనంతగిరి పోలీసులు భారీ మొత్తంలో గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రూ.15 లక్షల విలువైన గుట్కా, ఆటో, రెండు చరవాణిలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
![15 లక్షలు విలువైన గుట్కా స్వాధీనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5117146-546-5117146-1574186965951.jpg)
15 లక్షలు విలువైన గుట్కా స్వాధీనం