సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్‌లో ఓ ప్రేమికురాలు న్యాయపోరాటం చేస్తోంది. ఒకే గ్రామానికి చెందిన యువతీయువకులు ఒకరినొకరు రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. కాగా.. ఈ విషయం అమ్మాయి వాళ్లింట్లో తెలియగా.. మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. ఆ సమయంలో ప్రియుడు నోరు మెదపలేదు. ఫలితంగా.. మూడు నెలల క్రితం వేరొకరితో ఇష్టం లేని పెళ్లి చేసుకుంది. అక్కడితో ఆ కథ ముగిసిపోయిందని అనుకుంటే.. మళ్లీ ఆ యువతికి ప్రియుడు ఫోన్లు చేయటం మొదలు పెట్టాడు. యువతిలో లేనిపోని ఆశలు రేపాడు.
ఇంకేముంది.. తనతో రమ్మనగానే ఏమీ ఆలోచించకుండా కట్టుకున్న వాన్ని వదిలి ప్రియునితో వెళ్లిపోయింది. ఈ విషయం తెలిసి.. అమ్మాయి కుటుంబం, తన భర్త కుటుంబం షాకయ్యాయి. అందరిని వదిలి తనకోసం వచ్చిన యువతిని ప్రియుడు సంతోషంగా చూసుకున్నాడా..? అంటే.. నాలుగు రోజులకే ముఖం చాటేశాడు. పెళ్లయి నాలుగు నెలలు కూడా కాకుండానే ఇటు కట్టుకున్నవాన్ని వదిలి ప్రేమించినవానితో పోతే.. నాలుగు రోజుల్లోనే ప్రియుడు వదిలివెళ్లిపోవటంతో ఆ అమ్మాయి పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది.