అఘర్ దునియా మే సబ్ కంఫర్టబుల్ హోతే తో ర్యాప్ కౌన్ కర్తా? (నీలా ప్రతికూల పరిస్థితులు ఉన్న వారే సాధిస్తారు. అన్నీ అనుకూలంగా ఉంటే ర్యాప్ ఎవరు చేస్తారు?) ఎస్ నిజమే! ప్రతికూల పరిస్థితులను చూసి వెనకడుగు వేస్తే... మనలోని పట్టుదల, తెగువ, ధైర్యం చచ్చిపోతాయి. అన్ని మర్చిపోయి విజయకాంక్షనే లక్ష్యంగా ముందుకు సాగితే... నిన్ను కాదన్నవారే నీకు జేజేలు పలుకుతారు.
ర్యాప్.. అంటే ఏంటంటారా? అవును చాలా మంది ఇదే అడుగుతారేమో! తెలుగులో ర్యాపర్స్కు పెద్దగా గుర్తింపు లేకపోయినా... హలీవుడ్, బాలీవుడ్లో భలే క్రేజ్ ఉంది. ర్యాపర్స్ కష్టాల మీద ఇటీవల బాలీవుడ్లో వచ్చిన గల్లీబాయ్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అందులో హీరో మురాద్.. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. ర్యాపర్ కావాలని కలలుగని.. తన కలల్ని సాకారం చేసుకుని పెద్ద ర్యాపర్‌గా అవతరిస్తాడు. ఇంచుమించు ఇదే స్టోరీ రియల్ లైఫ్‌లోనూ ఉంది. మన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ బిడ్డ ర్యాపర్‌గా తన కలలను సాకారం చేసుకునే వేటలో పడ్డాడు. ఎంతకీ ఆ కుర్రాడు ఎవరంటే...
దరిపల్లి నవీన్.. రైతు కుటుంబానికి చెందినవాడు. ఊహ తెలిసినప్పటి నుంచి ర్యాపర్ కావాలనేదే కోరిక. తన కాంక్షను నెరవేర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మొదట్లో కష్టమైనా... ఇప్పుడు సాంగ్స్ బాగా ర్యాప్ చేయగలుగుతున్నాడు. నిజానికి తెలుగులో ర్యాపర్స్కి పెద్దగా గుర్తింపు లేదు. మళ్లీ అడిగితే అసలు ర్యాప్ అంటే ఏమిటి?అని అడిగేవాళ్లు లేకపోలేదు. ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న రోల్ రైడా, నోయల్ సీన్, మరికొంతమంది తప్ప తెలుగులో ర్యాపర్స్ అంటే తక్కువనే చెప్పుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ర్యాపర్ కావాలని దృఢ నిశ్చయంతో ఉన్న నవీన్ చేసిన ర్యాప్ ఇప్పుడు జనాలను ఆకట్టుకుంటోంది.
అన్నదాత కష్టాల మీద ర్యాప్ సాంగ్ చేసిన నవీన్... ప్రస్తుతం బీఎస్సీ అగ్రికల్చర్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచే బాలీవుడ్, హాలీవుడ్ ర్యాపర్ల నుంచి ప్రేరణ పొందిన నవీన్... తాను కూడా పెద్ద ర్యాపర్ కావాలని కలలు కన్నాడు. అంతటితో ఆగకుండా వాటిని సాకారం చేసుకునే దిశగా సాగిపోతున్నాడు.
రైతు కష్టాలను నవీన్ ర్యాప్ రూపంలో కళ్లకు కట్టినట్లు పాడాడు. రైతన్న శ్రమను అద్భుతంగా పాడి వినిపించిన నవీన్... తనలోని ర్యాపర్‌ను చూపించాడు. " తేరే అందర్ కా లావా ఫట్ కే బాహర్ ఆనే దే ( నీలో రగులుతున్న ఉన్న లావా పగిలి బయటకు రానీ)" అని దీని అర్థం. అవును నవీన్‌లో ర్యాపర్ కావాలనే కోరిక... లావాలా పగిలి బయటకు వస్తోంది. అందుకు నిదర్శనమే ఈ ర్యాప్....
" మూడు పుటల తింటరారా..
మూసుకోని ఉంటరారా...