సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లోని అక్కన్నపేట రహదారిలో ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ఆసుపత్రికి తరలించారు. మృతుడు హుస్నాబాద్ మండలం చౌటపల్లికి చెందిన బొంగరాజుగా గుర్తించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. భార్య గర్భవతి - సిద్ధిపేట వార్తలు
సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లోని అక్కన్నపేట రహదారిలో గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనానికి ఢీకొట్టగా యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి వివరాలు తెలుసుకొని కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు.
మృతుడి భార్య గర్భంతో ఉండగా.. అత్తగారి ఊరైన చౌటపల్లిలో వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటున్నట్టు బంధువులు తెలిపారు. మృతుడి స్వస్థలం వరంగల్ పట్టణ జిల్లా హసన్పర్తిగా పోలీసులు తెలిపారు. రాజు మరణ వార్త తెలుసుకున్న భార్య, బంధువులు హుటాహుటిన హుస్నాబాద్ ఆస్పత్రికి చేరుకున్నారు. గర్భవతి అయిన రాజు భార్య రోదనతో ఆస్పత్రి ప్రాంగణంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. రాజు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనాన్ని కనిపెట్టడానికి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. హుస్నాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:అకాల వర్షాలతో రైతన్న కష్టం నేలపాలు!