తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈతకు వెళ్లి.. యువకుడు మృతి - Siddipet District News

వేసవి తాపం నగరాల్లోనే కాదు.. గ్రామాల్లో సైతం చెమటలు పట్టేలా చేస్తున్నది. వేసవి తాపాన్ని తట్టుకోలేక ఈతకు వెళ్లిన యువకుడు నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన సిద్ధిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. యువకుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Young Man Died In Mallanna Sagar Canal
ఈతకు వెళ్లి.. యువకుడు మృతి

By

Published : May 26, 2020, 5:26 PM IST

సిద్ధిపేట జిల్లా తొగుట మండల కేంద్రానికి చెందిన కొమ్మెర ఫణీంద్ర రెడ్డి వేసవి తాపాన్ని తట్టుకోలేక సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. ఎండల వేడి తట్టుకోలేక తొగుట మండల కేంద్రానికి చెందిన కొమ్మెర ఫణీంద్ర రెడ్డి స్నేహితులతో కలిసి మల్లన్న సాగర్​ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న కాలువలో ఈతకు వెళ్లాడు.

కాలువ లోతు తెలియకపోవడం వల్ల నీట మునిగి మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి శవాన్ని పోస్టుమార్టం కోసం సిద్ధిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యువకుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో మరో 66 కరోనా పాజిటివ్‌ కేసులు

ABOUT THE AUTHOR

...view details