ప్రపంచవ్యాప్తంగా కలచివేస్తున్న కొవిడ్ వైరస్‌తో పాటు మరిన్ని రకాల వైరస్‌ను నశింపజేసే పరికరాన్ని సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన కాపర్తి భార్గవ్ కనుగొన్నారు. హైదరాబాద్‌లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్(ఇన్ఫర్మేన్ టెక్నాలజీ) ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. కరోనా వ్యాప్తి వల్ల ఆరు నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతరులకు ఉపయోగపడే పరికరాన్ని రూపొందించాలని భావించారు.
వినియోగం..
అలా అనుకున్నదే తడవుగా 'యూవీసీ వైరస్ కిల్లర్' నమూనాను రూపొందించారు. కరోనాతో పాటు ఇతరత్రా వైరస్‌లను నశింపజేసేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుంది. యూవీ కిరణాలకు ఎలాంటి వైరస్‌నైనా చంపే శక్తి ఉంటుందని... అయితే దీన్ని వినియోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని భార్గవ్ తెలిపారు.