తెలంగాణ

telangana

ETV Bharat / state

యువకుడి ప్రాణం తీసిన ఈత సరదా - సిద్దిపేటలో ఈతకు వెళ్లి యువకుడు మృతి

ఈత కోసం వెళ్లిన ఓ యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లి.. తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిల్చిన విషాద సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరులో చోటుచేసుకుంది. కుమారుడి మరణం వల్ల కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

young-boy-dies-after-swimming-in-siddipet-district
యువకుడి ప్రాణం తీసిన ఈత సరదా

By

Published : May 2, 2020, 11:29 AM IST

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామానికి చెందిన వుల్లెంగల వెంకటేశ్వర్లు, స్వరూపలకి ఇద్దరు కొడుకులు. పెద్ద కుమారుడు శ్రీకాంత్ మిత్రులతో కలిసి శుక్రవారం గ్రామశివారులోని వాగులో ఈత కోసం వెళ్లాడు. గత ఏడాది ఇసుక తరలించిన గుత్తేదారు ఇష్టానుసారంగా తీసిన గుంతలు లోతుగా ఉండటంతో ఇటీవల కురిసిన వర్షానికి నీరు నిలిచింది.

అయితే లోతు తెలియకపోవటం వల్ల అందులోకి దిగిన ఆ యువకుడు హఠాత్తుగా మునిగిపోయాడు. ఇది గమనించిన స్నేహితులు గట్టిగా అరిచారు. చుట్టుపక్కల రైతులు వచ్చి ఆ యువకుడిని బయటకు తీసే వరకే చనిపోయాడు. సమాచారం తెలుసుకొన్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details