సిద్దిపేట జిల్లా దుబ్బాక కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన నిర్వహించారు. లాక్డౌన్ కారణంగా గత రెండు నెలలుగా ఉపాధి లేక కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దుబ్బాక డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
తహసీల్దార్ కార్యాలయం ఎదుట కార్మికుల నిరసన - సిద్దిపేట జిల్లా దుబ్బాక తాజా వార్తలు
సీఐటీయూ ఆధ్వర్యంలో దుబ్బాక తహసీల్దార్ కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన చేశారు. అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న హమాలీ, ఆటో, బీడీ, భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం వారికి వెంటనే రూ. 7500 ఇవ్వాలన్నారు.
![తహసీల్దార్ కార్యాలయం ఎదుట కార్మికుల నిరసన Workers protest in front of tahsildar's office at dubbaka siddipet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7248710-944-7248710-1589801248385.jpg)
తహసీల్దార్ కార్యాలయం ఎదుట కార్మికుల నిరసన
అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న హమాలీ, ఆటో, బీడీ, భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వారికి వెంటనే రూ. 7500 చెల్లించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల చట్టాలను మార్చే విధానాన్ని ఉపసంహరించుకోవాలన్నారు.
ఇదీ చూడండి :ఉద్యోగిపై నుంచి టిప్పర్ లారీ దూసుకెళ్లింది