తెలంగాణ

telangana

ETV Bharat / state

వితంతు పింఛను కోసం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన - siddipet district news

పింఛను కోసం ముగ్గురు వితంతువులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వారు వాపోయారు.

Women protest for pension in siddipet district
వితంతు పింఛను కోసం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన

By

Published : Sep 19, 2020, 3:54 PM IST

సిద్దిపేట జిల్లా కొహెడ మండలం గుండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బుర్ల రాదవ్వ, కోరంపల్లి మల్లవ్వ, చింతల లక్ష్మీ అనే వితంతువులు పింఛను కోసం నిరసన తెలిపారు. గత మూడు, నాలుగు ఏళ్ల నుంచి వితంతు పింఛను కొరకు గ్రామ ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.

మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు ఎవరూ లేకపోవడం వల్ల తమకు న్యాయం జరిగేంతవరకు కార్యాలయం నుండి వెళ్లబోమని కార్యాలయం ఎదుట బైఠాయించారు. తమకు ఇప్పటికైనా అధికారులు పింఛన్లు మంజూరు చేయాలని వాపోయారు. విషయం తెలుసుకున్న గుండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రతిపక్ష నాయకులు వితంతువులకు సంఘీభావం తెలిపారు.

ఇవీ చూడండి: పల్లెల్లో పర్లేదు.. పురపాలికల్లో కరవైన చెత్తశుద్ధి కేంద్రాలు

ABOUT THE AUTHOR

...view details