కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఓ కళాకారుల బృందం వాహనదారులకు అవగాహన కల్పించారు. పోలీసులు, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్లలో యమధర్మరాజు, చిత్రగుప్తుడు, కరోనా భూతం, భటుడి వేషాలలో రోడ్లపై వెళ్తున్న వారికి కొవిడ్-19పై వివరించారు. అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావద్దన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.
విచిత్ర వేషధారణలతో...కరోనా కట్టడి ప్రచారం
కొవిడ్-19 కట్టడి కోసం పలు ప్రాంతాల్లో రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఓ కళాకారుల బృందం విచిత్ర వేషధారణలతో కరోనా వ్యాధి గురించి ప్రచారం చేశారు. ప్రధాన రోడ్లపై వచ్చిన వాహనదారులకు పలు సూచనలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు.
విచిత్ర వేషధారణలతో...కరోనా కట్టడి ప్రచారం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ నిబంధనలను ప్రజలు కచ్ఛితంగా పాటించాలన్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దన్నారు. విచిత్ర వేషధారణలతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కళాకారులను ఎస్సై సుధాకర్ అభినందించారు.
ఇదీ చూడండి :ఎగ్జిబిషన్ మైదానంలో అన్నీ ఫ్రీ