సిద్దిపేటలో మైనారిటీల అభ్యున్నతికి అధికారకంగా త్వరలోనే హజ్ హౌస్ అందుబాటులోకి రానుందని ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. పట్టణంలోని మదీనా ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటుచేశారు.
'పండుగ తర్వాత హజ్ హౌజ్‌ను ప్రారంభించుకుందాం' - SIDDIPETA HARISH
సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. రంజాన్ పండుగను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలి
మైనారిటీల కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి మంచి విద్యను అందిస్తున్నామన్నారు. హజ్ యాత్రికుల కోసం హైదరాబాద్ తర్వాత సిద్దిపేటలోనే 2 కోట్ల రూపాయలతో అద్భుతమైన హజ్ హౌస్ నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టెంట్లు, కూలర్లు, తాగునీరు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
ఇవీ చూడండి : హోంశాఖ సహాయమంత్రిగా కిషన్ రెడ్డి