తెలంగాణ

telangana

ETV Bharat / state

భర్త ఇంటి ముందు భార్య ఆందోళన.. - wife-protest-for-husband-at-siddipet

ఫేస్​బుక్​లో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కన్నాక భార్యను వదిలి భర్త వెళ్లిపోయాడు.

భర్త ఇంటి ముందు భార్య ఆందోళన..

By

Published : Sep 10, 2019, 5:15 PM IST

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామంలో భర్త కాపురానికి రావట్లేదని అతని ఇంటి ముందు భార్య బైఠాయించింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన భారతికి సిద్దిపేట జిల్లాకి చెందిన రంజిత్​కు నాలుగేళ్ల క్రితం ఫేస్​బుక్​లో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అనంతరం పెద్దలను ఎదిరించి పెళ్లి కూడా చేసుకున్నారు.

భర్త ఇంటి ముందు భార్య ఆందోళన..
పెద్దలకు దూరంగా కొన్నాళ్లు ఉన్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. సజావుగా సాగుతున్న సంసారంలో మనస్పర్థలు వచ్చాయి. తనను హింసిస్తున్నాడని భారతి వాపోయింది. కాపురానికి రావట్లేదని, తనను తన పిల్లలను పట్టించుకోవడం లేదని భర్త ఇంటి ముందు బైఠాయించింది. తన భర్తను తనకు అప్పగించి న్యాయం చేయాలని వేడుకుంటోంది. గ్రామంలోని మహిళలు ఆమెకు మద్ధతు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details