తెలంగాణ

telangana

ETV Bharat / state

ట్రాన్స్​జెండర్​గా మారి వేధిస్తున్న భర్త - సుపారీ ఇచ్చి హత్య చేయించిన భార్య

Wife Killed her Husband by Supari in Siddipet : కట్టుకున్న భర్త హిజ్రాగా మారి అదనపు కట్నం కోసం గురి చేస్తున్న వేధింపులను తట్టుకోలేకపోయింది. బిడ్డను ఇచ్చేయమంటూ పెడుతున్న ఇబ్బందులను సహించలేకపోయింది. కొంతకాలం భరించాక భర్త ప్రవర్తనతో విసిగి వేసారిన భార్య, ఎలాగైనా అతని అడ్డు తొలగించుకోవాలనుకుంది. మరో వ్యక్తితో కలిసి అతణ్ని అంతమొందించేందుకు కుట్ర పన్నింది. అనుకున్న పథకం ప్రకారం సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.

Supari Murder in Siddipet
Wife Killed her Husband by Supari in Siddipet

By ETV Bharat Telangana Team

Published : Jan 7, 2024, 6:09 PM IST

Wife Killed her Husband by Supari in Siddipet : సిద్దిపేట పట్టణంలో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా హిజ్రాగా మారి వేధిస్తున్న భర్తను, భార్య సుపారీ ఇచ్చి హత్య చేయించింది. గత డిసెంబర్​ నెలలో జరిగిన ఈ ఘటనలో భార్యతో సహా ముగ్గురు నిందితులను సిద్దిపేట(Siddipet) వన్‌ టౌన్‌ పోలీసులు శనివారం రిమాండ్‌కు పంపారు.

పెళ్లి బృందంపైకి కారు - యువతి మృతి, నలుగురికి గాయాలు

సిద్దిపేట సీఐ కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, సిద్దిపేటలోని బోయిగల్లీకి చెందిన వేదశ్రీకి నాసర్‌పురా వీధికి చెందిన దరిపల్లి వెంకటేశ్‌తో 2014లో వివాహం జరిగింది. 2015లో ఈ దంపతులకు పాప జన్మించింది. ఆ తర్వాతి నుంచి భర్త అదనపు కట్నం కోసం భార్యను వేధింపులు పెట్టడం ప్రారంభించాడు. క్రమంగా అతని ప్రవర్తనలో మార్పులు వచ్చి హిజ్రాగా మారి, రోజాగా తన పేరు మార్చుకున్నాడు.

Supari Murder in Siddipet :వీరిరువురి మధ్య గొడవలు తీవ్రతరం కావడంతో దంపతులు ఏడేళ్లుగా వేర్వేరుగా జీవిస్తున్నారు. కుమార్తెను తనకు ఇవ్వాలంటూ భార్యను తరచూ భర్త వేధించేవాడు. ఆమె ఉపాధ్యాయినిగా పని చేస్తున్న ప్రైవేటు పాఠశాల వద్దకు వెళ్లి ఇబ్బందులు పెట్టేవాడు. మరోవైపు, వేదశ్రీ గత కొంతకాలంగా పట్టణానికే చెందిన బోయిని రమేశ్‌తో సన్నిహితంగా ఉంటోంది. భర్త వేధింపులకు విసిగి వేసారిన వేదశ్రీ, అతనితో కలిసి రోజాను అడ్డు తొలగించుకునేందుకు పథకం రచించింది.

డ్రైవర్ నిర్లక్ష్యం, అన్నను బస్సు ఎక్కించేందుకు వచ్చిన రెండేళ్ల పాప మృతి

ఇందుకు సిద్దిపేట పట్టణానికి చెందిన వ్యాపారి రమేశ్‌తో రూ.18 లక్షలు ఇచ్చేందుకు సుపారీ కుదుర్చుకున్నారు. రెండు విడతల్లో రూ.4.60 లక్షలు ముట్టజెప్పారు. గత ఏడాది డిసెంబరు 11న నాసర్‌పురాలో తన ఇంట్లో ఒంటరిగా ఉన్న రోజాకు రమేశ్‌ స్నేహితుడైన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నాగరాజుపల్లికి చెందిన ఇప్పల శేఖర్‌ ఫుల్​గా మద్యం తాగించాడు.

తాగిన మైకంలో ఉన్న రోజాను మరో ఇద్దరు వ్యక్తుల సాయంతో దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అప్పట్లో రోజా మృతిని వన్‌టౌన్‌ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. శవ పంచనామాలో హత్యగా నిర్ధారణ కావడంతో పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలు సేకరించారు. రోజా హత్యలో వేదశ్రీతో పాటు మరో ఐదుగురి పాత్ర ఉందని తేల్చారు. వేదశ్రీ, బోయిని రమేశ్‌, ఇప్పల శేఖర్‌లను పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

గుండెపోటుతో కుమారుడు, తట్టుకోలేక తల్లి - గంట వ్యవధిలో కుటుంబంలో తీరని విషాదం

ABOUT THE AUTHOR

...view details