సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వైద్యుల నియామకం చేపట్టకపోవడం వల్ల రోగులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని నిరసన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో ఉన్న కొద్ది మంది వైద్యులు దశల వారీగా విధులకు హాజరవుతూ రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వాసుపత్రిలో మౌలిక సదుపాయాలేవి..? - సీపీఐ నాయకులు ఆందోళన చేశారు.
ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రిలో సరైన మౌలిక సదుపాయాలు లేవని సీపీఐ నాయకులు ఆందోళన చేశారు.
ప్రభుత్వాసుపత్రిలో మౌలిక సదుపాయాలేవి..?
రాత్రి వేళలో ఆస్పత్రికి వచ్చే రోగులకు కంపౌండర్లే చికిత్సలు చేస్తున్నారని అన్నారు. అత్యవసర చికిత్స కోసం హుస్నాబాద్ ఆసుపత్రికి వస్తే.. కరీంనగర్, వరంగల్, ఆస్పత్రులకు రిఫర్ చేస్తూన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రజాప్రతినిధులు స్పందించి ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగుపరచాలన్నారు. లేని పక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి : ఓటరు లిస్టులో ఐరన్ సత్యనారాయణ, డోంట్ చేంజ్ బాపు
TAGGED:
HOSPATAL EDUTA_CPI DHARNA