తెలంగాణ

telangana

ETV Bharat / state

మాస్క్​లు ధరించి బీడీలు చుట్టండి:హరీశ్​రావు - masks

సిద్ధిపేట జిల్లా కేంద్రంలో జరిగిన బీడీ వర్కర్స్​ యూనియన్​ సభకు  స్థానిక ఎమ్మెల్యే హరీశ్​రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలోనే తొలిసారిగా బీడీ కార్మికులకు జీవనభృతిని అందించిన ఘనత సీఎం కేసేఆర్​ అని కొనియాడారు.

మాస్క్​లు ధరించి బీడీలు చుట్టండి:హరీశ్​రావు

By

Published : Aug 25, 2019, 9:43 PM IST

సిద్ధిపేట జిల్లా కేంద్రంలో బీడీ వర్కర్స్​ యూనియన్​ జిల్లా స్థాయి ప్రథమ సభలు జరిగాయి. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే హరీశ్​రావు ముఖ్య అతిథిగా హారయ్యారు. దేశంలో మెుదటిసారిగా బీడీ కార్మికులకు జీవనభృతిని అందించిన ఘనత సీఎం కేసీఆర్​కే దక్కుతుందని పేర్కొన్నారు. బీడీలు చుట్టిన అనంతరం జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వచ్చే వ్యాధుల గురించి వివరించారు. మాస్క్​లు ధరించి బీడీలు చుట్టాలని సూచించారు. త్వరలోనే సిద్ధిపేటలో అంబికా దర్బార్​ బత్తి కంపెనీ తీసుకువస్తానని హామీ ఇచ్చారు.

మాస్క్​లు ధరించి బీడీలు చుట్టండి:హరీశ్​రావు

ABOUT THE AUTHOR

...view details