సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సాదులనగర్‌లో తాగునీటి కోసం గ్రామపంచాయతీ పాలకవర్గం బోరుబావిని తవ్వించింది. మొదట్లో నీరు మాములుగానే వచ్చింది. గతంలో కురిసిన వర్షాలకు భూగర్భజలాలు బాగా పైకి వచ్చాయి. చెరువులు కుంటలు నిండాయి.
బోరు బావి నుంచి ఉబికివస్తున్న నీరు - Siddipet district latest news
ఒకప్పుడు తాగేందుకు చుక్క నీరు దొరకలేదు. తాగు నీరు కోసం గ్రామపంచాయతీ పరిధిలో బోరు బావి తవ్వించినా మొదట్లో నీరు మామూలుగానే వచ్చేవి. కానీ ప్రస్తుతం ఆ బోరు బావి నుంచి నీరు పైకి ఉబికివస్తున్నాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో చోటుచేసుకుంది.
![బోరు బావి నుంచి ఉబికివస్తున్న నీరు Water overflowing from a bore well in Siddipet district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10529992-898-10529992-1612662049143.jpg)
బోరు బావి నుంచి ఉబికివస్తున్న నీరు
బోరు బావి నుంచి ఉబికివస్తున్న నీరు
దీంతో చెరువు సమీపంలో తవ్వించిన బోరుబావి కేసింగ్ నుంచి నీరు పైకి ఉబికి వస్తున్నాయి. విషయం తెలిసిన గ్రామస్థులు వచ్చి చూసి వెళుతున్నారు. ఆ నీరు మొత్తం పక్కనే ఉన్న చెరువులోకి వెళ్లడంతో నీటిమట్టం బాగా పెరిగే అవకాశం ఉందని వారు చర్చించుకుంటున్నారు.
ఇదీ చదవండి: కోఠిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
Last Updated : Feb 7, 2021, 9:17 AM IST