ఇటీవల కురిసిన వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరడం వల్ల ప్రాజెక్టు అనుసంధానంగా ఉన్న జలాశయాల్లోకి అధికారులు పంపుల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. అందులో భాగంగానే సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలంలోని కొండపోచమ్మ జలాశయంలోకి అధికారులు మూడు పంపుల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.
కొండపోచమ్మ జలాశయానికి జలకళ - సిద్దిపేట జిల్లా తాజా వార్తలు
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో నిర్మించిన కొండపోచమ్మ జలాశయంలోకి అధికారులు నీటిని విడుదల చేశారు. మూడు పంపుల ద్వారా 7.4 టీఎంసీల నీరు చేరుకోవడం వల్ల జలాశయం జలకళను సంతరించుకుంది.
నిండుకుండల్లా జలాశయాలు... జలకళతో ప్రాజెక్టులు
జలాశయం సామర్థ్యం 15 టీఎంసీలు కాగా... ఇప్పటి వరకు 7.4 టీఎంసీల నీరు చేరిందని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు జలకళను సంతరించుకోవడం వల్ల సందర్శకుల తాకిడి పెరిగింది.