సిద్దిపేట జిల్లా తొగుట మండలం వరదరాజపల్లి గ్రామ సరిహద్దుల్లో డంపింగ్ యార్డులో నిరంతరాయంగా వ్యర్థ పదార్ధాలు, ప్లాస్టిక్ కవర్లు గుట్టలుగుట్టలుగా పారేసి తగలబెడుతున్నారు. ఇలా తగలపెట్టడం వల్ల వచ్చే బూడిద దమ్మయ చెరువు, కాషాయ కుంటల్లోకి చేరడం వల్ల ఆ నీరు కలుషితమై, చెడు వాసన వస్తోందని వరదరాజపల్లి గ్రామస్థులు వెల్లడించారు. కలుషిత వ్యర్థాలు నీటిలో కలవడం వల్ల గ్రామంలోని చెరువులో చేపలు చనిపోతున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
డంపింగ్ యార్డులో వ్యర్థాల తగలబెట్టడం వల్ల రైతులకు ఇక్కట్లు - waste water flows in river at varadarajapalli in siddipet district
సిద్దిపేట జిల్లా వరదరాజపల్లి గ్రామ సరిహద్దుల్లో డంపింగ్ యార్డులో వ్యర్థ పదార్థాలు ప్లాస్టిక్ కవర్లు.. తగలబెట్టగా ఆ బూడిద సమీపంలోని చెరువులు, కుంటల్లో చేరుతున్నాయి. దాని వల్ల అవి కలుషితమై గ్రామస్థులు ఇబ్బందిపడుతున్నారని.. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
డంపింగ్ యార్డులో వ్యర్థాల తగలబెట్టడం వల్ల రైతులకు ఇక్కట్లు
ఆయకట్టు చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి పశువులు, పక్షులు ఆ చెరువులో నీళ్లు తాగి చనిపోయే ప్రమాదముందని .. వీటితో పాటు ఆ నీరు పొలాల్లో చేరడం వల్ల పంటలు సరిగ్గా పండవని వాపోయారు. సంబంధిత అధికారులు తక్షణం స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని.. ఎలాంటి ప్రాణనష్టం, ధననష్టం జరగకుండా చూడాలని గ్రామప్రజలు కోరుతున్నారు.
ఇదీ చూడండి:సామాజిక మరుగుదొడ్లు వాడే వారిలో 62శాతం మందికి కరోనా