Warm Welcome to the Newly Elected MLAs : అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు శాసనసభలో ప్రమాణస్వీకారం అనంతరం సొంత నియోజకవర్గాలకు వెళ్లారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా గజ్వేల్‌కు వచ్చిన పొన్నం ప్రభాకర్‌కు కాంగ్రెస్(Congress) శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలను 100 రోజుల్లో ప్రారంభిస్తామని మరోసారి పొన్నం స్పష్టం చేశారు.
"కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేసి తీరుతాం. అధికారంలోకి రాగానే ప్రగతిభవన్ కంచెను బద్దలుకొట్టి ప్రజాభవన్‌గా మార్చాము. సామాన్యులకు ప్రవేశం కల్పించి సమస్యలను స్వీకరిస్తున్నాము". - పొన్నం ప్రభాకర్, రవాణాశాఖా మంత్రి.
రైతులకు యాసంగి పంట పెట్టుబడి సాయం చెల్లింపులు ప్రారంభం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కోరం కనకయ్య తొలిసారి నియోజకవర్గంకు చేరుకున్నారు. ఎమ్మెల్యే కోరం కనకయ్యకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, ఘన స్వాగతం పలికారు. పట్టణంలో పార్టీ శ్రేణులు నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో విలంబును పట్టుకొని బాణం వదిలారు. మరోవైపు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఏరియా ఆస్పత్రిలో ఆరోగ్య శ్రీ పథకం పరిమితి పెంపును ఎమ్మెల్యే జైవీర్ ప్రారంభించారు.
జనగామ జిల్లా చిల్పూర్ మండలం శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాడానికి వచ్చిన బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పండితుల నుంచి ఆశీర్వాచనం అందుకున్న కడియం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం నియోజకవర్గానికి వచ్చిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు
ప్రముఖ పుణ్యక్షేత్రం హనుమకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మహిళలకు ఉచిత ప్రయాణం సేవలను ప్రారంభించారు. కొత్తగూడెంలో సాంబశివరావు విజయాన్ని కాంక్షిస్తూ మిత్రపక్షాలు భారీ ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా కూనంనేనితో పాటు పలువురు నాయకులు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ముందుకు కదిలారు.
"ప్రజల ఆశీర్వాదంతో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం లభించింది. ఈ దేవాలయ అభివృద్ధికి గత ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కూడా ఈ ఆలయ అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తుందని, ఆశిస్తున్నాను. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాను". - కడియం శ్రీహరి, ఎమ్మెల్యే.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఆదేశిస్తాం - నీటి వాటా విషయంపై కేంద్రంతో చర్చిస్తాం : ఉత్తమ్