ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం మాటలు అహంకారపూరితంగా ఉన్నాయని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షురాలు విమలక్క అన్నారు. సిద్దిపేట డిపో ఆవరణలో సమ్మె చేస్తున్న కార్మికులకు మద్దతు పలికారు. ముఖ్యమంత్రి స్థాయిని మరిచి మాట్లాడడం సరికాదన్నారు. ప్రభుత్వం దిగివచ్చి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించేవరకు పోరాడతామన్నారు.
ఆర్టీసీ సమ్మెకు విమలక్క మద్దతు - vimalakka support to rtc strike in siddipeta
ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షురాలు విమలక్క డిమాండ్ చేశారు. సిద్దిపేట డిపో ఆవరణలో 22వ రోజు సమ్మె చేస్తున్న కార్మికులకు మద్దతు తెలిపారు.

కార్మికులతో విమలక్క